గోపాలక్రిష్ణ నీ గొప్పదనము
ఆనందభైరవి రాగం , మిశ్రం తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
గోపాలక్రిష్ణ నీ గొప్పదనము నెంచ గోపికలున్నారులే
క్రిష్ణయ్య గోపికలున్నారు లే
గోపికలను గూడి గొంపోయి అడవిలో
కోలాటమేశావులే
క్రిష్ణయ్య కోలాటమేశావులే
ఆడవేషము వేసి అమృతము గొనిపోయె
అమరులకిచ్చావులే
క్రిష్ణయ్య అమరులకిచ్చావులే
వాడవాడలు తిరిగి సయ్యట లాడుచు
చెలియాల గూడావులే
క్రిష్ణయ్య చెలియలా గూడావులే
పాలివ్వ వచ్చిన పడతిని పట్టుకు ప్రాణాలు తీశావులే
క్రిష్ణయ్య ప్రాణాలు తీశావులే
బాలుడవే నీవు కాలితో శకటాసురు
కూలగతన్నావులే క్రిష్ణయ్య కూలగతన్నావులే
గద్దరించి తల్లి పట్టి రోలను గట్ట మద్దుల గూల్చావులే
క్రిష్ణయ్య మద్దుల గూక్చావులే
మద్దుల కూల్చగా పెద్దలందరు నిన్ను నారాయణుడన్నారులే
క్రిష్ణయ్య నారాయణడన్నారులే
ఆవుదూడ తోక ఆడవారి జుట్టు కమరంగా కట్టావులే
క్రిష్ణయ్య అమరంగా కట్టావులే
దూడలు పరిగెత్త ఆడువారు లేచి కుయ్యో మన్నారులే వారిని చూచి పక్కున నవ్వావులే
గోవర్ధన గిరి గొడుగుగుగా పెట్టి గోవుల్ని గాచావులే
క్రిష్ణయ్య గోవుల గాచావులే
గోవులను కాయంగ గోపికలందరు గోపాలుడన్నారు లే
ఇంద్రుడు గోవిందుడన్నారులే
మంగళమని నారీమణులందరు గూడి పొంగుచూ పాడారులే
క్రిష్ణయ్య పొంగుచూ పాడారులే
అంగనాయణికి అక్షయ వలువలు ఇచ్చి రక్షించావులే
క్రిష్ణయ్య ఇచ్చి రక్షించావులే
క్రిష్ణా క్రిష్ణా గోపాల క్రిష్ణ గోవింద క్రిష్ణ క్రిష్ణ
క్రిష్ణయ్య గోవిందా క్రిష్ణా క్రిష్ణా
క్రిష్ణా క్రిష్ణా గోపాల క్రిష్ణ గోవింద క్రిష్ణ క్రిష్ణ
క్రిష్ణయ్య గోపాల క్రిష్ణా క్రిష్ణా
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి