మా చిన్ని క్రిష్ణునికి
హంసధ్వనిరాగం , మిశ్రచాపుతాళం
గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
మా చిన్ని క్రిష్ణుని మధుర మీగడ వెన్న
మా కన్న తండ్రికి మంగళారతులు
చరణం :
పొన్న చెట్టు మీద చిన్నారి నా తండ్రి
చీరలన్నీ దాచి వేణువూదే వేళ
మా చిన్ని క్రిష్ణుని మధుర మీగడ వెన్న
మా కన్న తండ్రికి మంగళారతులు
రేపల్లెె వాడలో గోపికల ఇండ్ల లో
పాలు మీగడ వెన్న ఆరగించే వేళ
మా చిన్ని క్రిష్ణుని మధుర మీగడ వెన్న
మా కన్న తండ్రికి మంగళారతులు
గోపికా నృత్యాలు తారాడు నాదాలు
ఆలమందల నెల్ల గాచేటి ఆ వేళ
మా చిన్ని క్రిష్ణుని మధుర మీగడ వెన్న
మా కన్న తండ్రికి మంగళారతులు
మా కన్న తండ్రికి మంగళారతులు
మా కన్న తండ్రికి మంగళారతులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి