నవ విధ గణపతి
Audio
నవ విధ గణపతి నమో నమో
పరమదయాళో పాహి ప్రభో
అగ్రగామిగా వర్ధిల్లనీరా
అనుపమ తేజ బాలగణపతి
ఆత్మసిద్ధి పెంపొందచేయరా
వినుత పదాన విద్యా గణపతి
కలిమి నొసగరా లక్ష్మీ గణపతి
కైవల్యమీరా సిద్ది గణపతి
నవ విధ గణపతి నమో నమో
పరమదయాళో పాహీప్రభో
సరియగు నడవడి అలవడనీరా
సకల కళానిధి నాట్య గణపతి
శాంతము బూని స్వతంత్రుడై
సాగనీరా శక్తి గణపతి
వర్ధిల్ల చేయరా వల్లభ గణపతి
అభయము నీయరా ఆది గణపతి
నవ విధ గణపతి నమో నమో
పరమదయాళో పాహి ప్రభో
పరమదయాళో పాహిప్రభో
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి