21, ఆగస్టు 2017, సోమవారం

భాద్ర పదమున bhadrapadamuna

భాద్ర పదమున
మోహనరాగం ,ఆదితాళం
గానం : మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
భాద్ర పదమున శుద్ధ చవితిని వ్రతమోనరింతుము వినాయకా
వెతలే తొలగి విజయము కలుగగా
వినుతింతుము మా విఘ్న వినాయకా
నమో నమో గణ నాయకా
నమో నమో శుభకారక

చరణం:
పాలవెల్లి లో  భద్ర పీఠమున నీ దివ్వమూర్తిని నిలిపెదము
పరిమళ సుమములు అర్చన చేసి
ఫలములు ఉండ్రాళ్ళు అర్పింతుమురా ….నమో నమో గాణనాయక...

పత్రిని వేసి పూజలు చేసి
దీప ధూపములు చూపెదము
మ్రోలను చేసి మోకరిల్లుచూ  నవరాత్రంమ్ములు నిన్ను కొలిచెదము…
..,...నమో నమో గణనాయకా …

నీ కధ చదివి అక్షింతలనే  
శిరమున దాల్చి అలరెదెరు
మంగళమనుచు మగువలు అందరు
హారతులిచ్చి మురిసెదరు
..,...నమో నమో గణనాయకా …

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి