10, ఆగస్టు 2017, గురువారం

Piluvare krishuni పిలువరే క్రిష్ణుని

పిలువరే కృష్ణుని
Piluvare krishuni
దేవ గాంధర్వ రాగం, ఏకతాళం
గానం : మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను
పొలసి ఆరగించే ప్రొద్దాయ నిపుడు

వెన్నలారగించబోయి వీధులలో దిరిగీనో
యెన్నరాని యమునలో యీదులాడీనో
సన్నల సాందీపనితో చదువగబోయినాడో
చిన్నవాడాకలి గొనె చెలులాల యిపుడు

మగువల కాగిళ్ల మరచి  నిద్దిరించీనో
సొగసి ఆవులగాచే చోట నున్నాడో
యెగువ నుట్లకెక్కి యింతులకు జిక్కినాడో
సగము వేడికూరలు చల్లనాయ నిపుడు

చెంది నెమల చుంగుల సింగారించుకొనీనో
ఇందునే దేవరవలె ఇంటనున్నాడో
అందపు శ్రీవేంకటేశుడు ఆడివచ్చె నిదె వీడె
విందుల మాపొత్తుకు వేళాయ నిపుడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి