10, ఆగస్టు 2017, గురువారం

Guruterigina donga గురుతెరిగిన దొంగ

గురుతెరిగిన దొంగ
Guruterigina donga
మోహనరాగం , తిశ్రగతి తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
గురుతెరిగిన దొంగ కూగూగు
గుడిలోనే దాగీనె కూగూగు
వీడె గుడిలోనే దాగీనె కూగూగు

చరణం :
నెలతల దోచీని నీళ్ళాడగానే
కొలని దరిని దొంగ కూగూగు
బరువైన వుట్ల పాలారగించీని
కొలది మీరిన దొంగ కూగూగు

తావుకొన్న దొంగ తగిలి పట్టుండిదె
గోవులలో దొంగ కూగూగు
శ్రీ వెంకటగిరి చెలువుండో  యోమో
కోవిందుడగు దొంగ కూగూగు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి