13, సెప్టెంబర్ 2017, బుధవారం

Bhavamulona bahyamunandu భావములోన బాహ్యమునందు

భావములోన బాహ్యము
శుద్ధ ధన్యాసి రాగం,  ఆదితాళము
సంగీతం : వేదునూరి క్రిష్ణమూర్తి
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు

Audio
పల్లవి :
భావములోన బాహ్యము నందును
గోవిందా గోవిందా యని కొలువవో మనసా ll

చరణం :
హరియవతారములే అఖిల దేవతలు
హరిలోనివే బ్రహ్మాండంబులు
హరినామములే అన్ని మంత్రములు
హరి హరి హరి హరి హరి యనవో మనసా ll
...భావములోన బాహ్యము నందును…

విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా ll
...భావములోన బాహ్యము నందును…

అచ్యుతుడితడే ఆదియు నంత్యము
అచ్యుతుడే అసురాంతకుడు
అచ్యుతుడు శ్రీ వేంకటాద్రి మీద నిదె
అచ్యుత అచ్యుత శరణనవో మనసా ll
…...భావములోన బాహ్యము నందును
గోవిందా గోవిందా అని పలుకవో మనసా….

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి