13, సెప్టెంబర్ 2017, బుధవారం

Podagantimaiah minnu పొడగంటిమయ్యా మిమ్ము

పొడగంటిమయ్యా మిమ్ము
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా, మమ్ము
నెడయకవయ్య కోనేటి రాయడా

చరణం :
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల
నేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పి దీర్చు కాలమేఘమా, మాకు
చేరువ చిత్తములోని శ్రీనివాసుడా

భావింప కైవసమైన పారిజాతమా, మమ్ము
చేవదేర గాచినట్టి చింతామణీ
కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము
తావై రక్షించేటి ధరణీధరా

చెడనీక బ్రతికించే సిద్దమంత్రమా, ఓం నమో వేంకటేశాయా ఓం నమో వేంకటేశాయా
చెడనీక బ్రతికించే సిద్దమంత్రమారోగా
లడచి రక్షించే దువ్యౌషధమా
బడి బాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము
గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి