చూడరమ్మ సతులాల
మధ్యమావతి రాగం , ఆది తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది కూడిన్నది పతిచూడి కుడుత నాంచారి
శోభానే...శోభానే….2
చరణం :
శ్రీమహాలక్ష్మీ అట సింగారాలకే మరుదు
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు
సోముని తోబుట్టువట సొంపు కళలకే మరుదు
కోమలాంగి ఈ చూడికుడుత నాంచారి
...చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది కూడిన్నది పతిచూడి కుడుత నాంచారి
శోభానే...శోభానే….2
కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు
తలప లోక మాతయట దయ మరి ఏ మరుదు
జలజ నివాసినియట చల్లదనమే మరుదు
కొలది మీర ఈ చూడి కుడుత నాంచారి
…..చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది కూడిన్నదిపతిచూడి కుడుత నాంచారి
శోభానే...శోభానే….2
అమర వందితయట అట్టె మహిమ ఏమరుదు
అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు
తమితో శ్రీ వేంకటేశు తానె వచ్చి పెండ్లాడె
కొమెరె వయస్సు ఈ చూడి కుడుత నాంచారి
….చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది కూడిన్నది పతిచూడి కుడుత నాంచారి
శోభానే...శోభానే….2
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి