12, సెప్టెంబర్ 2017, మంగళవారం

Tapamemi toli chesitaiah తపమేమి తొలి చేసితయ్యా

తపమేమి తొలిచేసితయ్య
షణ్ముకరాగం , ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
పల్లవి :
తపమేమి తొలిచేసితయ్య
తిరువేంకటాధీశ నిను గూర్చినేపాడ

చరణం  :
జప సూత్రముల నేరనయ్యా
జన్నాల హోమాల విది నెరుగనయ్యా
అపచార యుక్తుండనైనా
కృపచూపి నన్నేలి నాచేత పాడించు
….. తపమేమి తొలిచేసితినయ్య…….

ఏ పూర్వ పుణ్యంబు ఫలమో
ఏనాడు ఏనోము నే నోచినానో
జననంబు ఫలియించగాను
నెనరుంచి నన్నేలి నాచేత పాడించు
…..తపమేమి తొలిచేసితయ్య….

అవ్యాజ కారుణ్యమవునో
దివ్యానురాగంబు ఔదార్యమౌనో
అత్యలప పుణ్యండుడైనా
అలమేలు మంగేశ పలుమారు పాడించు
….తపమేమి తొలిచేసితయ్య…...

1 కామెంట్‌:

  1. ఆ భగవంతుని అనుగ్రహ గానాన్ని చక్కటి తెలుగు లో అందించినందుకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి