కులుకక నడవరో
అఠానారాగం ,ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు
ఒయ్యనే మేను కదలీ వొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీ పాద తాకు కాంతలాలా
పయ్యద చెరగు జారీ భారపు గుబ్బల మీఁద
అయ్యో చెమరించి మాయమ్మకు నెన్నుదురు
చల్లెడి గంధవొడి మై జారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు పణఁతులాలా
మొల్లయైన కుందనపు ముత్యాల కుచ్చులధర
గల్లనుచు కంకణాలు కదలీ మాయమ్మకు
జమళి ముత్యాలతోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల హారతు లెత్తరో
అమరించి కౌఁగిట అలమేలుమంగ నిదె
సమకూడె వేంకటేశ్వరుఁడు మాయమ్మకు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి