ఓం జయ జయ శ్రీనివాస
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
ఓం జయ జయ శ్రీనివాసా స్వామి జయ తిరుమలవాసా
భక్తుల కష్టము తీర్చుటకై ఇలవెలసిన దేవా
ఓం జయ జయ శ్రీనివాసా
చరణం :
ఏడుకొండల స్వామివి నీవు కరుణాధాముడవు
పిలచిన పలికే దేవుడవు
అలమేలుమంగ పతివి
ఓంజయ జయ శ్రీనివాసా..
ఆపద మొక్కుల స్వామివి నీవే ఆదుకొందువు దేవా
ఆర్తుల భాధలు తొలిగించి ఆనందమొసగు దేవా
ఓం జయ జయ శ్రీనివాసా…
శ్రీ ,భూ దేవుల గూడి స్వామి తిరు వీధులలోనూ
ఊరేగుచునూ దయాదృష్టితో భక్తుల బ్రోచెదవు
స్వామి భక్తుల బ్రోచెదవు….
వరహస్వామి క్షేత్రమందున నివసించే స్వామి
ప్రతి ఫలముగ ఆ స్వామికి నీవు ధనరాశుల నిత్తువట
ఓం జయ జయ శ్రీనివాసా….
మానవ మాత్రుల వలనే నీవు
లీలా నటనలతో
వడ్డికాసులు వసూలు చేసి రక్షణ చేతువయ్యా
భక్తుల రక్షణ చేతువయ్యా….
వేంకటనాధుడు అంటేనే మా పాపహారీ కాదా
భక్తుల పాపము తొలగించి ముక్తి నొసగుమయ్య
ఓం జయ జయ శ్రీనివాసా…
జయ మంగళమయ్యా స్వామి
శుభ మంగళమయ్య
శుభ పరంపరల నొసగి మమ్ము కాపాడదయ్యా
మము కాపాడగదయ్యా…..
ఓం జయ జయ శ్రీనివాసా…
ఓం జయ జయ శ్రీనివాసా…
ఓం జయ జయ శ్రీనివాసా…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి