7, సెప్టెంబర్ 2017, గురువారం

Raja rajeswari రాజ రాజేశ్వరి

రాజ రాజేశ్వరీ
అరభిరాగం , ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
రాజరాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి
తేజ స్వరూపిణి దైత్య సంహారిణి
త్రిజగత్ భగవతి శరణు నిన్నే నమ్మితి

రాజరాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరీ…..

చరణం :
శుక్రవారపు పూజ శుభ దినములలోన
కొలువై యుండగ చూడగా
అడిగిన వారికి అభయము లిచ్చే తల్లి
అతులిత భాగ్యము లొసగు సర్వేశ్వరి

రాజరాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి…

అఖిలాండేశ్వరి నిత్య కళ్యాణి
కోటి సూర్య ప్రకాశిని
కంచికామాక్షి మధురమీనాక్షి కాశీవిశాలాక్షి కరుణించు ఈశ్వరీ

రాజరాజేశ్వరీ దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి…..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి