7, సెప్టెంబర్ 2017, గురువారం

Srunga giri pura vasini శృంగ గిరి పుర వాసిని

శృంగ గిరి పురవాసిని
రచన : వేమూరి సరోజనీ శాస్త్రిగారు
సామరాగం , ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
శృంగ గిరి పురవాసిని జననీ
మంగళకారిణి శ్రీ శారదే
శ్రీ భారతీ తీర్ధ అర్చిత చరణే
శుభదే వరదే శారదే

శృంగ గిరి పురవాసిని జననీ
మంగళకారిణి శ్రీ శారదే శ్రీ శారదే…..

చరణం :
బుద్ధి ప్రదాయిని జ్ఞానదాయిని మోక్షదాయిని శారదే
శ్రీ విద్యా స్వరూపిణి లలితే శ్రీచక్రార్చిత శారదే
బ్రహ్మాణి కమలాసను రాణి వీణా పాణి శారదే
ఆది శంకర హృదయ విహారిణి జగద్ధోధారిణి శారదే
….శృంగ గిరి పురవాసిని……

సప్త స్వరముల సంగీత సామ్రాజ్ఞి సులలిత పదే శ్రీ శారదే
సామవేద స్వరూపిణీ వాణి షణ్ముఖార్చిత శారదే
కోమల గాత్రి పరమ పవిత్రి గాయత్రీ శ్రీ శారదే
సరోజ దళ నేత్రి సావిత్రి భారతి విధాత్రి శారదే

శృంగ గిరి పురవాసిని జననీ
మంగళకారిణి శ్రీ శారదే
శ్రీ భారతీ తీర్ధ అర్చిత చరణే
శుభదే వరదే శారదే
శృంగ గిరి పురవాసిని జననీ
మంగళకారిణి శ్రీ శారదే శ్రీ శారదే…..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి