తేనెకంటే మధురమయ్య
రచన : వేమూరి సరోజని శాస్త్రిగారు
రచన : వేమూరి సరోజని శాస్త్రిగారు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
తేనెకంటే మధురమయ్య నీపేరు
తిరుమల తిరుపతి స్వామి జోహారు
చరణం :
నీకొండకు వచ్చేము నిలువు దోపులిచ్చేము
దండిగా కానుకలు హుండీలో వేసేము
ఆపద మొక్కుల స్వామి వెంకటేశ్వరా
అడుగడుగు దండాల తిరుమలేశ్వరా
…..తేనెకంటే మధురమయ్య….
కలియుగము లోన నీకు ఆలయైన వేల్పు లేదు
గోవిందాయని అంటే ఓయంటు పలుకుతావంట
ఏడుకొండల పైని బంగారుకొండ
మా తోడు నీడ నీవయ్య కూరిమి పంట
…...తేనెకంటే మధురమయ్య…..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి