13, సెప్టెంబర్ 2017, బుధవారం

Entamatrama , ఎంతమాత్రమున‌‌‌

ఎంతమాత్రమున
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు
అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు…..ఎంత….

కొలుతురు మిము  వైష్ణువులు కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలుతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులాది భైరవుండనుచు....ఎంత...

సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే యల్పబుద్ది దలచిన వారికి అల్పంబవుదువు
గరిమల మిము నే  ఘనమని దలచిన  ఘనబుద్దులకు ఘనుడవు
నీవలన కొరతే లేదు మరి నీరు కొలది
తామెరువు
ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీవేంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని
ఈ వలనే నీ శరణ ననెదను ఇదియే పరతత్వము నాకు.....4
….ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు…...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి