27, డిసెంబర్ 2017, బుధవారం

Sankranti vachindi gobbiyallo సంక్రాంతి వచ్చింది గొబ్బియళ్ళో

సంక్రాంతి వచ్చింది గొబ్బియళ్ళో
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో

చరణం :
సంక్రాంతి వచ్చింది గొబ్బియళ్ళో సందళ్ళు తెచ్చింది గొబ్బియళ్ళో
సంక్రాంతి వచ్చింది సందళ్ళు తెచ్చింది
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో
చెలియలందరు గూడి గొబ్బియళ్ళో చేరువైతిరమ్మా గొబ్బియళ్ళో..2

ముగ్గులు పెట్టిరి ముచ్చట్లు చెప్పిరి గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో
రంగవల్లులు  దీర్చే గొబ్బియళ్ళో రత్నకాంతుల నింపె గొబ్బియళ్ళో...2
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో

భోగి మంటల వెలుగు గొబ్బియళ్ళో పొంగళ్ళ తీపి గొబ్బియళ్ళో
భోగి మంటల వెలుగు పొంగళ్ళ తీపి గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో
పసుపు కుంకుమ పెట్టి గొబ్బియళ్ళో పొగడ పూలు పెట్టిగొబ్బియళ్ళో ..2

గన్నేరు పువ్వులు గౌరిదేవికి పెట్టి గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో
పందిట్లో ఆడేరు గొబ్బియళ్ళో పడుచులందరు కలసి గొబ్బియళ్ళో.‌.2
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో

గుడిలోన గంటలు  గొబ్బియళ్ళో ఓంకారనాదాలు గొబ్బియళ్ళో
గుడిలోన గంటలు ఓంకారనాదాలు గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో
హరిదాసు పాటాలు గొబ్బియళ్ళో గంగెద్దు ఆటలు గొబ్బియళ్ళో….2

పచ్చని పైరులు పాడిపంటలు నిండా గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో
ఊరువాడయెల్ల గొబ్బియళ్ళో పరవశించిరమ్మా గొబ్బియళ్ళో...2
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో.
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో.గొబ్బియళ్ళో….గొబ్బియళ్ళో
గొబ్బియళ్ళో….గొబ్బియళ్ళో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి