వేదములే నీ నివాసమట
మధ్యమావతిరాగం ,ఆది / ఏకతాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
పల్లవి :
వేదములే నీ నివాసమట విమల నారసింహా
నాదప్రియ సకల లోకపతి నమో నమో నరసింహా
చరణం :
ఘోరపాతక నిరుహరణ కుటిల దైత్యదమనా
నారాయణ రమాధినాయక నగధర నరసింహా
నీరూపము ఇంత అంతయని నిజము తెలియరాదు
ఈ రీతి త్రివిక్రమాకృతి నేచితి నరసింహా..
...వేదములే నీ నివాదమట విమల నారసింహ…
గోవిందా గుణగణ రహిత
కోటిసూర్యతేజా
శ్రీవల్లభ పురాణ పురుషా శిఖ నఖ నరసింహా
దేవా మిము బ్రహ్మాదులకును తెలియ నలవి కాదు
భావించగ ప్రహ్లాదు నెదుట పరగితి నరసింహా..ఆ..ఆ...ఆ..
….వేదములే నీ నివాసమట విమల నారసింహ….
దాస పరికర సులభ తపన చంద్ర నేత్రా
వాసవ సురముఖ మునిసేవిత వందిత నరసింహా
భాసురముగా శ్రీ వేంకటగిరిని పాయని దైవమ వటుగానే
ఓసరకిపుడు ఏగితి విట్ల అహోబిల నరసింహా..ఆ..ఆ..ఆ
……....వేదములే నీ నివాసమట విమల నారసింహ
నాదప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ….
వే్ములే నీ నివాట విమల నారసింహ
విమల నారసింహ….విమల నారసింహ……….
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి