19, మార్చి 2018, సోమవారం

Namo namo lakshmi narasimha నమో నమో లక్ష్మీ నరసింహ

నమో నమో లక్ష్మీనరసింహ
పూర్ణచంద్రిక రాగం, ఆదితాళం ,
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
నమో నమో లక్ష్మీ నరసింహ
నమో నమో సుగ్రీవ నరసింహ

చరణం:
వరద సులభ భక్త వత్సల నరసింహ
నరమృగవేష శ్రీ నరసింహ
పరమ పురుష సర్వ పరిపూర్ణ నరసింహ
గిరి గుహావాసా సుగ్రీవ నరహింహ
…….నమో నమో లక్ష్మీ నరసింహ…..

భయహర ప్రహ్లాద పాలన నరసింహ
నయన త్రయారవింద నరసింహ
జయ జయ సురముని సంస్తుత నరసింహ
క్రియా కలాపా సుగ్రీవ నరసింహ
…...నమో నమో లక్ష్మీ నరసింహ…..

అతి కృపానిలయ మోహనరూప నరసింహ
నతపితామహ ముఖ్యా నరసింహ
సతత శ్రీ వేంకటేశ్వర దివ్య నరసింహ
కితవారి భంజన సుగ్రీవ నరసింహ
……..నమో నమో లక్ష్మీ నరసింహ
నమో నమో సుగ్రీవ నరసింహ …...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి