బ్రహ్మ కడిగిన పాదము
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానె నీ పాదము ll
చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలితల మోపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము ll
కామిని పాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము ll
పరమయోగులకు పరి పరి విధముల
పర మొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమపదము నీ పాదము ll
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి