21, మే 2018, సోమవారం

Muddugare Yasoda mungita ముద్దుగారే యశోద ముంగిట

ముద్దుగారే యశోద
కురంజి రాగము  ,ఆదితాళము
గానం : శ్రీమతి విద్యాభారతిగారు.
Audio
పల్లవి :
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకి సుతుడు ll

చరణం :
అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస
చెంతల మాలోనున్న చిన్నికృష్ణుడు ll

రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచే కమలాక్షుడు ll

కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము
పాల జలనిధిలోన పాయని దివ్యరత్నము
బాలుని వలె తిరిగి పద్మనాభుడు ll

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి