గోదావరి హారతి
కళ్యాణి రాగం,ఏక తాళం ,తిశ్రగతి
రచన :కాశీభట్ల సత్యన్నారాయణ
సంగీతం :ఆకొండి శ్రీనివాస రాజారావు
Audio
పల్లవి :
శ్రీరాముని పాద్యంబగు మాజీవ భాగ్యంబగు
మాతల్లికి గౌతమికి జయము జయము జయము
అను పల్లవి :
జన జీవన జనయిత్రికి సౌభాగ్యద సీమంతికి
జయము జయము జయము జయము
…..శ్రీరాముని…..
చరణం :
పగటి వెలుగు తళతళలా శశికాంతుల మిలమిలలా
ముట్టుకుంటే అంటుకొనే తడి వెలుగని శృతి పొగడిన
మా తల్లికి జయము జయము జయము
…...శ్రీరాముని……
వనసీమల వరిసీమల నారికేళ ఫలసీమల
తన పిల్లల కరుణించుచు మురిసిపోవు మా తల్లికి
జయము జయము జయము జయము
…..శ్రీరాముని…..
గోక్షీరము తనదు నీరు వరిఅన్నము తనదు రూపు
గౌతమాది మహర్షుల చేతివ్రాత తరంగాల
మాతల్లికి గౌతమికి జయము జయము జయము
…...శ్రీరాముని…..
ఈ పాద్యము మా భాగ్యము ఈ హారతి నీదు కాంతి
అమృతఫల నైవేద్యము మాదు తృప్తి కాదు తల్లి
నీది నీకు నిచ్చు తృప్తి నిరతంబుగా సాగనిమ్ము
మాతల్లికి గౌతమికి జయము జయము జయము
…..శ్రీరాముని…..
ఎంతమంది సంతానమే అంతమంది కడుపునిండ
సాగిపోవు మాతల్లి మాముందే ఉన్నట్లుగా
చూచి చూచి తరియింతుము తెలిసి తెలిసి వర్తింతుము
కోనసీమ పరిపూతకు ఋషి మార్గపు సంశేవ్యకు
మాతల్లి గౌతమికి జయము జయము జయము
…..శ్రీరాముని…..
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి