గోమహలక్ష్మికి బసవరాజుకి
బసవన్నా, గోమాతల పెళ్ళి పాట
మధ్యమావతి రాగం
పల్లవి:
గోమహాలక్ష్మీకి, బసవరాజుకి పెళ్ళి చూపులండీ
చూచిన ముహూర్తమెలాంటిదో, మరి పెళ్ళి కుదెరనండీ, ఆనందమాయెనండీ...2
చరణం:
1. రంకెలు వేసే బసవన్నా, ఓరచూపుల గోలక్ష్మీ...2
పెళ్ళి పెద్దల సందడితో ప్రశాంతముగా వున్నారండీ...2
గోమహలక్ష్మీకి, బసవరాజుకి పెళ్ళి కుదెరనండి, ఆనందమాయెనండి.
2. పసుపు కుంకుమలు గంధాక్షతలు పండ్లు పూలు సిద్దము చేసి..2
బసవన్నకు పట్టు వస్త్రము లిచ్చి, గోమహలక్ష్మీని అలంకరించి...2
పెళ్ళివారెంతో మురిసినారండీ
గోమహలక్ష్మీకి, బసవరాజుకి పెళ్ళి కుదెరనండి, ఆనందమాయెనండి.
3. ధర్మమునకు ప్రతిరూపము మాబసవేశ్వరుడండీ...2
డూ..డూ.. బసవన్న కాడండి శివభక్తి పరాయణుడండీ...2
గోమహలక్ష్మీకి, బసవరాజుకి పెళ్ళి కుదెరనండి, ఆనందమాయెనండి.
4. గోమహలక్ష్మీ సాక్షాత్తు భుస్వరూపమండీ...2
అందచందాల సహన గుణముతో ప్రకాశించునండి
గోమహలక్ష్మీ సాక్షాత్తు భుస్వరూపమండీ
అందచందాల సహన గుణముతో ప్రకాశించునండి
అమృత తుల్యమగు క్షీరధారలతో అందరినీ పోషించునండి….2
లోకమును కాపాడునండి..లోకములను కాపాడునండి
గోమహలక్ష్మీకి, బసవరాజుకి పెళ్ళి కుదెరనండి, ఆనందమాయెనండి.
5. బ్రహ్మవేత్తలు వేదమంత్రములు పఠించినారండీ...2
సిరులొలికే గోలక్ష్మికి ఠీవిగ నిలబడు బసవరాజుకి ….2
పెళ్ళి కుదెరెనండీ ...2
మాంగల్యం తంతునానేనా లోకరక్షణ హేతునా, కంఠే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం…సంజీవ శరదాం శతం….
గోమహలక్ష్మీకి, బసవరాజుకి పెళ్ళి జరిగెనండి, ఆనందమాయెనండి
6.ఈ కళ్యాణము జరుగుట చూచి దేవతలంతా దీవించేరు...2
అందరి మనస్సులు అనందముతో నిండిపోయెనండీ…..2
జయలక్ష్మీ శ్రీనివాసుల హృదయాలు ఉప్పోంగెనండీ …..2
హృదయాలు ఉప్పోంగెనండి...2
గోమహలక్ష్మీకి, బసవరాజుకి పెళ్ళి జరిగెనండి, ఆనందమాయెనండీ
ఆనందమానందమాయెనే
మాగోలక్ష్మీ పెళ్ళికూతురాయెనే
ఆనందమానందమాయెనేే
మాబసవన్నా పెళ్ళికొడుకాయనే…2
మాగోలక్ష్మీ పెళ్ళికూతురాయెనే
మాబసవన్నా పెళ్ళికొడుకాయనే…
😊 😳 😊 😳 😊 😳 😊 😳 😊 😳 😊 😳
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి