పిడికిట తలంబ్రాలు
గానం:శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు….పిడికిట….
చరణం :
పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద
పేరుల మ్యుత్యాల మెడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు
పేరు కుచతచ సిగ్గుపడి పెండ్లి కూతురు
…….పిడికిట……
బిరుదు పెండెము వెట్టె పెండ్లి కూతురు నెర
బిరుదు మగని కంటె పెండ్లి కూతురు
పిరుదూరినపుడె పెండ్లి కూతురు పతి
పెరరేచీ నిదివో పెండ్లి కూతురు
…...పిడికిట…….
పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే
పెట్టెడు చీరలు గట్టె పెండ్లి కూతుర
గట్టిగా వేంకటపతి కౌగిటను వడి
వెట్టిన నిధానమైమ పెండ్లి కూతురు.
…….పిడికిట…...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి