23, మే 2018, బుధవారం

Tiruveedhula తిరువీధుల

తిరు వీధుల
ఏకతాళము, శ్రీరాగము
గానం :శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
తిరు వీధుల మెరసి దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను

చరణం :
తిరు దండెలపై నేగి దేవుడిదే తొలినాడు
సిరుల రెండవనాడు శేషునిమీద
మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి కింద
పొరి నాలుగో నాడు పూవు కోవిల లోన
…...తిరు వీధుల మెరసి దేవ దేవుడు……

గ్రక్కున ఐదవనాడు గరుడిని మీద
ఎక్కెను ఆరవనాడు ఏనుగు మీద
చొక్కమై ఏడవనాడు సూర్యా ప్రభలోనను
ఇక్కువ తేరును గుర్ర మేనిమిదో నాడు
….తిరు వీధుల మెరసి దేవదేవుడు…..

కనకపు టందలము  కదిసి తొమ్మిదో నాడు
పెనచి పదోనాడు  పెండ్లి పీట
ఎనసి శ్రీవేంకటేశు డింతి అలమేల్ మంగతో
వనితల నడుమను వాహనాల మీదను

తిరువీధిల మెరసి దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను
తిరువీధిల మెరసి దేవదేవుడు
దేవదేవుడు….దేవదేవుడు…..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి