పూబోణుల కొలువే
ఆదితాళం తిల్లాంగరాగం
గానం : శ్రీమతి విద్యాభారతిగారు
పల్లవి :
పూబోణుల కొలువే పుష్పయాగము
పూవొక పూచే నీకిటే పుష్పయాగము
పూబోణుల కొలువే పుష్పయాగము
చరణం :
కలువ రేకుల వంటి ఘనమైన కన్నుల
పొలతుల చూపులే నీ పుష్పయాగము
తలచి తలచి నిన్ను తమ మేనుల పొడమే
పులక జంపములే నీ పుష్పయాగము
...పూబోణుల కొలువే….
కరకమలములను కందువ గోపికలెల్ల
పొరసి నిన్ను చూపుటే పుష్పయాగము
సరసపు మాటలే సారెనాడె తమ నవ్వు
పొరి నీపై జల్లుటే పుష్పయాగము
…..పూబోణుల కొలువే…
గాటపు కొలనీదండ కాంతలు సిగ్గున నిన్ను
బూటకానకు తీట్టుటే పుష్పయాగము
ఈటున శ్రీ వేంకటేశ యిట్టే అలమేల్మంగ
పూట పూట రతులివి పుష్పయాగము.
పూబోణుల కొలువే పుష్పయాగము
పూవొక పూచే నీకిటే పుష్పయాగము
పూబోణుల కొలువే పుష్పయాగము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి