23, మే 2018, బుధవారం

Podale nindu kalala పొదలే నిండు కళల

పొదలే నిండు కళల
అనందభైరవి రాగం ,ఆదితాళం
గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
జాజర జాజర జాజర జాజర జాజా
జాజర జాజర జాజర జాజర జాజా
పొదలే నిండు కళల పూన్నమ నేడు
జాజర జాజర జాజర జాజర జాజా
అదను తప్పక జాజరాడుదవు రావయ్య

చరణం:
జలజాక్షీ మోమునకు చంద్రోదయ మాయ
నెలకొన్న నవ్వుల వెన్నెల గాసెను వెన్నెల గాసెను
కలికి కన్నుల నల్ల కలువలు వికసించే
అలరి ఈకెతో జాజరాడుదువు రావయ్య
జాజర జాజర జాజర జా జర జాజా

యెనసీ , జవ్వనమున యేతెంచే వసంతకాల
మొనరి మొవి చిగురు లుప్పతిల్లెను చిగురు లుప్పతిల్లెను
గొనకొన్న తురుమున కూడే తుమ్మెద మూక
అనుమానించక జాజరాడుదువు రావయ్య
జాజర జాజర జాజర జా జర జాజా

కుంకుమ చెమట చను కొప్పెరలా నిండుకొనే
కొంకుక గోళ్ళే బుర్రట కొమ్ములాయెను బుర్రట కొమ్ములాయెను
లంకలై శ్రీవేంకటేశ లలనతో కూడితివి
అంకెలనే పొద్దు జాజరాడుదువు రావయ్య

పొదలే నిండు కళల పూన్నమ నేడు
జాజర జాజర జాజర జా జర జాజా
అదను తప్పక జాజరాడుదవు రావయ్య
జాజర జాజర జాజర జా జర జాజా
జాజర జాజర జాజర జా జర జాజా
జాజర జాజర జాజర జా జర జాజా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి