30, మే 2018, బుధవారం

Ranganatha sriranganatha రంగనాధా

రంగనాధా శ్రీరంగనాధా
గానం:శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
రంగనాధా శ్రీరంగనాధా
లక్ష్మీ హృదయాంతరంగనాధా

దోసములెంచకు రంగనాధా
దోసిలొగ్గితిని శ్రీరంగనాధా
కరుణించి బ్రోవుమయా కావేటిరంగా
సిరిగల దేవడవు కరుణాంతరంగా
….రంగనాధా...

హృదయ తాపముల తొలగించు రంగా
పదసరోజముల పూజింతురంగా
అరమోడ్పు కన్నులతో కరుణించరాదా
మొరవినరాదా పాలించరాదా
….రంగనాధా….

ముత్యాల కవచముతో మురిసేటి స్వామి
మురిపాల ఉయ్యాల లూగేటి స్వామి
శ్రీదేవి భూదేవి సేవలందుచు
భక్తుల మాటే మరువకుమయ్యా
...రంగనాధా….

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి