16, జూన్ 2018, శనివారం

Suvvi suvvi suvvani సువ్వి సువ్వి సువ్వని

సువ్వి సువ్వి సువ్వని
కేదారగౌళ రాగం , ఆదితాళం
స్వర రచన : శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ
Audio
సువ్వి సువ్వి సువ్వని
సుదతులు దంచెదరోలాల

వనితలు మనసులు కుందెన చేసిటు
వలపులు తగనించోలాల
కను చూపుల నెడు రోకండ్లను
కన్నెలు దంచెదరోలాల

బంగరు చెరగుల పట్టు పుట్టములు
కొంగులు దూలగనోలాల
అంగనలందరు నతి వేడుకతో
సంగడి దంచెదరోలాల

ఘల్లు ఘల్లుమను కంకణరవముల
పల్లవ  పాణుల వోలాల
అల్లన నడుములు అసియాడుచు
సతులొల్లనె దంచెదరోలాల

కప్పుర గంధులు కమ్మని పువ్వుల
చప్పరములలో నోలాల
తెప్పలుగా రతి తేలుచు
కోనేటప్పని పాడెదరోలాల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి