తపమేమి తొలిచేసినయ్య
షణ్ముకరాగం , ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
పల్లవి :
తపమేమి తొలిచేసినయ్య
తిరువేంకటాధీశ నిను గూర్చినేపాడ
చరణం :
జప సూత్రముల నేరనయ్యా
జన్నాల హోమాల విధి నెరుగనయ్యా
అపచార యుక్తుండనైనా
కృపచూపి నన్నేలి నాచేత పాడించు
….. తపమేమి తొలిచేసినయ్య…….
ఏ పూర్వ పుణ్యంబు ఫలమో
ఏనాడు ఏనోము నే నోచినానో
జననంబు ఫలియించగాను
నెనరుంచి నన్నేలి నాచేత పాడించు
…..తపమేమి తొలిచేసితయ్య….
అవ్యాజ కారుణ్యమవునో
దివ్యానురాగంబు ఔదార్యమౌనో
అత్యల్ప పుణ్యండుడైనా
అలమేలు మంగేశ పలుమారు పాడించు
….తపమేమి తొలిచేసినయ్య
తిరువేంకటాధీశ నిను గూర్చినేపాడ
తపమేమి తొలిచేసితయ్య
తపమేమి తొలిచేసితయ్య…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి