22, మే 2018, మంగళవారం

Eedagu pendli ఈడగు పెండ్లి

ఈడగు పెండ్లి
మధ్యమావతి రాగము , ఆదితాళము
గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు

పల్లవి :
ఈడగు పెండ్లి ఇద్దరి జేసేము
చేడెలాల ఇది చెప్పరుగా

చరణం :
పచ్చిక బయళ్ళు పడతి యాడగా
ముచ్చట కృష్ణుడు మోహించి
వెచ్చపు పూదండ వేసి వచ్చెనట
గచ్చుల నాతని కానరుగా

ముత్తెపు ముంగింట ముదిత నడవగా
ఉత్తముడే చెలి వురమునకు
చిత్తరువు వ్రాసి చెలగి వచ్చెవొళ్ళ
జోత్తు మాని ఇటు చూపరుగా

కొత్త చవికలో కొమ్మ నిలిచితే
పొత్తున తలబ్రాలు వోసెనట
ఇత్తల శ్రీ వేంకటేశుడు నవ్వుచు
హత్తి సతి గూడెనని పాడరుగా
Audio

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి