Audio
తిరుమలయ్య విందు మంచిదే
గానం: విద్యాభారతిగారు
తిరుమలయ్య విందు మంచిదే ఉండంటే ఉంటినమ్మా
సరవి లేని చెంచు వారి సంత యేలే తనకును….
పరికిదండ పొగడదండ బండి గురి గింజ దండ
బెరకు లేని పికిలిదండ బలిదండలన్నియు మెరసి కానుకివ్వపోతే మేనిదండ లడిగేనమ్మ
మరలా చెంచు వారి తోడి మాటలేలే తనకును…..తిరుమలయ్య…...
ముసురుతేనే జుంటితేనే ముదిరినట్టి పెరలతేనే
పొసగమించు పువ్వుతేనే పుట్టతేనెలన్నియును
ఒసగి కానుకియ్యబోతే మోవి తేనెలడెెగెనమ్మా
యెసల చెంచు వారి యెంగిలేటికమ్మ తనకును….తిరుమలయ్య….
వెలగపండు జీడిపండు వెలలేని మోవిపండు
బలుపు దొండ పండు పాలపండు కానుకిచ్చితే
జలధిపక్కపండు మంట శ్రీ వేంకటనాయకుడు
యెలమి కూడెనమ్మ చెంచు లేటికమ్మ తనకును…...తిరుమలయ్య…..
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి