17, జూన్ 2018, ఆదివారం

Endagani need a can I. ఎండగాని నీడగాని

ఎండగాని నీడగాని
రాగం : నీలాంబరి ,తాళం : ఆది
Audio
పల్లవి :
ఎండగాని నీడగాని ఏమైనాగాని
కొండలరాయుడే మా కులదైవము

చరణం :
తేలగాని పాముగాని దేవ పట్టయినగాని
గాలిగాని ధూళిగాని కానియేమైనా
కాలకూట విషమైన గక్కున మింగిన నాటి
నీలవర్ణుడే మా నిజదైవము..

చీమగాని దోమగాని చెలది యేమైనగాని
గాముగాని నాముగాని కానియేమైనా
పాములనిన్నిటి మింగే బలుతేజి పై నున్న
ధూమకేతువే మా దొర దైవము

పిల్లిగాని నల్లిగాని పిన్న యెలుకైనాగాని
కల్లగాని పొల్లగాని కానియేమైనా
బల్లిదుడై వేంకటాద్రి పైనున్న యాతడే
మమ్మెల్ల కాలమును ఏలే ఇంటి దైవము.

…..‌‌‌పల్లవి……...మా నిజదైవము….మా దొరదైవము…..మా ఇంటి దైవము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి