తిమ్మిరెడ్డి మాకు నిచ్చె
ఆరభి రాగం ,ఆదితాళం
స్వర రచన : శ్రీ సత్తిరాజు వేణుమాధవ్
Audio
పల్లవి :
తిమ్మిరెడ్డి మాకు నిచ్చె …...ఏ...ఏ….
తిమ్మిరెడ్డి మాకు నిచ్చె దిష్టమైన పొలము
బొమ్మిరెడ్డి కప్పగించి పోదిసేసె బొలము
చరణం:
నిండి నట్టి మడుగుల నీరు వంక పొలము
కొండలు మోచిన పెద్ద గొబ్బరపు పొలము
అండనే పొలము రాజులుండేటి పొలము
చెండి వేసి మాకు నెల్ల సెలగిన పొలము
అసపడి వరదానమడిగిన పొలము
బాసలతో గడు నెత్రు పట్టమైన పొలము
రాసికెక్కి మునులకు రచ్చైన పొలము
వేసరక నాగేట వేగిలైన పొలము
మంచి గురుతైన రావి మాని చేని పొలము
వంచిన గుఱ్ఱము తోలే వయ్యాళి పొలము
యెంచగ శ్రీ వేంకటేశు నిరవైన పొలము
పంచుకొని లోకులెల్లా బ్రదికేటి పొలము
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి