18, ఆగస్టు 2018, శనివారం

రామ చక్కని సీతకి rama chakkani sita ki

రామ చక్కని సీతకి -- GodavariAudio
నీల గగనా ఘనవిచలనా ధరణిజా శ్రీ రమణ
మధుర వదనా నళిన నయనా మనవి వినరా రామా

రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకి

ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో
రామ చక్కని సీతకి

ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటె
చూడలేదని పెదవి చెప్పె చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు నల్లనీ రఘురాముడు
రామ చక్కని సీతకి

చుక్కనడిగా దిక్కునడిగా చేమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచె
చూసుకోమని మనసు తెలిపె మనసు మాటలు కాదుగా

రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంక యెవరు మొగుడంట

ఇందువదనా కుందరదనా మందగమనా భామా
ఎందువలన ఇందువదనా ఇంతమదనా ప్రేమా ??

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి