21, నవంబర్ 2018, బుధవారం

Kailasa Giri nundi kasikiకైలాసగిరి నుండి కాశికై

కైలాసగిరి నుండి కాశికై
రచన :దేవులపల్లి క్రిష్ణశాస్త్రీగారు
పున్నాగ వరాళి రాగం, ఖండగతి తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
కైలాసగిరి నుండి కాశికై , కాశికాపురి నుండి దాసికై
దాసికై ఈ దక్ష వాటికై దయచేసినావయ
హరహర హరహర హరహర హరహర..2
శివశివా శంభో హరహరా శంభో…..

చరణం :
విరిసె జాబిలి మల్లెరేకగా , కురిసె తేనియల మువ్వాకగా
దరిసె నీ దయ నిండు గోదావరి నది ఝరులాయరా హర
హరహర హరహర హరహర హరహర...2
……...కైలాసగిరి నుండి కాశికై , కాశికాపురి నుండి దాసికై
దాసికై ఈ దక్ష వాటికై దయచేసినావయ
హరహర హరహర హరహర హరహర..2
శివశివా శంభో ,హరహరా శంభో…...


ముక్కోటి దేవతల నేతరా , ముల్లోకములకిష్ట దాతరా
వెలిబూది పూతరా నలవిషము మేతరా
హరహర హరహర హరహర హరహర..2
……..కైలాసగిరి నుండి కాశికై , కాశికాపురి నుండి దాసికై
దాసికై ఈ దక్ష వాటికై దయచేసినావయ
హరహర హరహర హరహర హరహర ..2 శివశివా శంభో ,హరహరా శంభో…..

2 కామెంట్‌లు:

  1. పల్లవి – భావం
    శివుడి దివ్యస్థలం కైలాసం నుండి కాశి వరకు విస్తరించిన నీ కరుణ, అక్కడి నుండి ఈ దక్షవాటిక (దక్షారామం /
    ద్రాక్షారామం / పవిత్రక్షేత్రం) వరకు వచ్చి, అక్కడి భక్తులను నీ దాసులుగా చేసుకునేంతగా దయ చూపావు.
    అంటే శివుని కృప అన్ని లోకాలకూ, అన్ని క్షేత్రాలకూ చేరుతుంది అనే భావం.
    చరణం 1 – భావం
    నీ కరుణ వెలుగుతో
    చంద్రుడు మల్లెపువ్వులా వికసిస్తున్నాడు,
    తేనె వానలాగా ఆనందం కురుస్తోంది,
    గోదావరి నది నీ దయతో నిండిన పవిత్ర జలాల ప్రవాహంలా మారింది.
    చరణం 2 – భావం
    నువ్వు ముక్కోటి దేవతల నాయకుడు,
    మూడు లోకాలకూ వరాలు ఇచ్చే దాత,
    శరీరానికి విభూతి పూసుకునే వాడు,
    లోకాల రక్షణ కోసం హాలాహల విషాన్ని పానంచేసినవాడు.

    రిప్లయితొలగించండి