30, డిసెంబర్ 2018, ఆదివారం

Inakula tilaka ఇనకుల తిలకా

ఇనకుల తిలక
అభేరీ రాగం , ఏకతాళం
రామదాసు కీర్తన
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
పల్లవి :
ఇనకుల తిలక…..
ఇనకుల తిలక ఏమయ్యా రామయ్యా
శ్రీరామచంద్రా విని వినకున్నావు
వినరాదా నామొర శ్రీరామచంద్రా
ఇనకుల తిలకా……..

చరణం :
కనకాంబరధర కపటమేలనయ్యా
శ్రీరామచంద్ర జనకాత్మజా రమణ
జాగుసేయకుమయ్య శ్రీరామ చంద్రా
వినరాదా నామొర శ్రీరామచంద్రా
ఇనకుల తిలకా……

ధశరథసుత  నా..దశ చూడవయ్యా
శ్రీరామచంద్రా పశుపతినుత నామా
ప్రార్థించి మ్రొక్కెద శ్రీరామచంద్రా
వినరాదా నామొర శ్రీరామచంద్రా
ఇనకుల తిలకా……

నీవేగతియని నెర నమ్మియున్నాను
శ్రీరామచంద్రా కావవే యీవేళ
కాకుత్స కుల తిలక శ్రీరామచంద్రా
వినరాదా నామొర శ్రీరామచంద్రా
ఇనకుల తిలకా……

రామా….రామాభద్ర శైలధామ శ్రీరామ
శ్రీరామచంద్రా వేమరు వేడెద
రామదాసుని బ్రోవ శ్రీరామచంద్రా
…….వినరాదా నామొర శ్రీరామచంద్రా
ఇనకుల తిలకా ఏమయ్యా రామయ్యా
శ్రీరామచంద్రా విని వినకున్నావు
వినరాదా నామొర శ్రీరామచంద్రా….2
ఇనకుల తిలకా……..ఆ...ఆ..‌‌ఆ….ఆ….

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి