8, జనవరి 2019, మంగళవారం

Mangalamani padare మంగళమని పాడరే


మంగళమని పాడరే
సురటిరాగం,  ఏకతాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
రచన,స్వర రచన :వేమూరి సరోజిని శాస్త్రీగారు
Audio
పల్లవి :
మంగళమని పాడరే….శుభ మంగళమని పాడరే….
అంగనలందరూ గోదాతల్లికి మంగళమని పాడరే…
మంగళమని పాడరే…

చరణం :
విష్ణుచిత్తుని ప్రియపుత్రి
విష్ణుమూర్తి ప్రియ సఖి
విల్లి పుత్తురున జన్మించి
విమలమతియై పరిగిన తల్లికి
…...మంగళమని పాడరే శుభమంగళమని పాడరే….

వటపత్ర సాయిని ప్రేమించి
వసుదేవసుతునే సేవించి
తననే గోపికగా  తలచి
పాడి పరవశించిన తల్లికి
….మంగళమని పాడరే శుభమంగళమని పాడరే….

లోకమున జనులను  తరియింప జేయుటకు
పవిత్రమగు తిరుప్పావై రచియించి
అజ్ఞాన తిమిరమున నిద్రించు
జగమును మేల్కొలిపిన బంగారు తల్లికి
…….….మంగళమని పాడరే….శుభ మంగళమని పాడరే….
అంగనలందరూ గోదాతల్లికి మంగళమని పాడరే…
మంగళమని పాడరే…మంగళమని పాడరే…

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి