సతులాల ఓ..సతులాల
అన్నమయ్య సంకీర్తన
కాపీ రాగం , ఆది తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
సతులాల ఓ..సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి
కథలాయా నడురేయి కలిగే శ్రీక్రిష్ణుడు
చరణం:
పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
యెట్టు ధరియించెనే ఈ క్రిష్ణుడు
అట్టె కిరీటము ఆభరణాలు ధరించి
యెట్ట నెదుట నున్నాడు ఈ క్రిష్ణుడు
…..సతులాల ఓ..సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి
కథలాయా నడురేయి కలిగే శ్రీక్రిష్ణుడు….
కొద దీర మరి నందగోపునకు యశోదకు
ఇదివో తాబిడ్డడాయె నీ క్రిష్ణుడు
అదనా శ్రీవేంకటేశుడై యలమేల్మంగ గూడి
యెదుటనే ఉన్నాడు ఈ క్రిష్ణుడు
…..సతులాల ఓ..సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి
కథలాయా నడురేయి కలిగే శ్రీక్రిష్ణుడు…..3
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి