28, జనవరి 2019, సోమవారం

Vinayamunanu వినయమునను కౌశికుని

వినయమునను కౌశికుని
రాగం : సౌరాష్ట్ర ...తాళం : మిశ్రచాపు
త్యాగరాజ స్వామి వారి దివ్యనామ సంకీర్తన
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు.
Audio
పల్లవి :
వినయమునను కౌశికుని వెంట
జని నాంగ్రులను జూచేదెన్నటికో
అందు వెనుక రాతిని నాతి చేసిన
చరణములను జూచేదెన్నటికో

చరణం :
ఘనమైన శివుని చాపమును
దృంచిన పాదమును జూచేదెన్నటికో
ఆ జనకరాజు పాల కడిగిన యా
కాళ్ళను జూచేదెన్నటికో

చనువున సీతకు బొట్టు కట్టిన
కరమును జూచేదెన్నటికో
కోపమున భృగుసుతు చాప
బలమందుకొన్న బాహువు జూచేదెన్నటికో

కనికరమున విభీషణుని
చూచిన కన్నులను జూచేదెన్నటికో
రావణుని గొట్టి పెద్ద కపుల
లేవ జూచే దృష్టిని జూచేదెన్నటికో

ఆగమ వినుతుని ఆనందకందుని
బాగా జూచేదెన్నడో
పరమ భాగవతా ప్రియుని నిర్వికారుని
రాక జూచేదెన్నడో

సాగర శయనుని కరుణా జలానిధిని
వేగ జూచేదెన్నడో
వరత్యాగరాజాది దేవతలు
పొగడుకొనేలాగు జూచేదెన్నడో
…….రామా ఎన్నడో...రామా ఎన్నడో ...రామా ఎన్నడో…..

25, జనవరి 2019, శుక్రవారం

Aalola tulasi ఆలోల తులసీ


ఆలోల తులసీ
ఆలోల తులసీ వనమాలా భూషణ శ్రీరామ రామా హరే
శ్రీమన్నారాయణ కృష్ణ గోవింద జగన్నాధ పురుషోత్తమాం పాలయ

దశరధబాలా దశముఖకాలా శ్రీరామ రామా హరే
శ్రీమన్నారాయణ కృష్ణ గోవింద జగన్నాధ పురుషోత్తమాం పాలయ

కాళీయ మర్ధన కంస విదూరా శ్రీకృష్ణ కృష్ణా హరే
శ్రీమన్నారాయణ కృష్ణ గోవింద జగన్నాధ పురుషోత్తమాం పాలయ

బలభద్ర శ్రీ కృష్ణ సుభద్ర సమేత శ్రీజగన్నాధా హరే
శ్రీమన్నారాయణ కృష్ణ గోవింద జగన్నాధ పురుషోత్తమాం పాలయ

కౌసల్యా తనయా కరుణార్ధ్ర హృదయా శ్రీరామ రామా హరే
శ్రీమన్నారాయణ కృష్ణ గోవింద జగన్నాధ పురుషోత్తమాం పాలయ

గోపీ మానసచోరా మంధర గిరిధర శ్రీకృష్ణ కృష్ణా హరే
శ్రీమన్నారాయణ కృష్ణ గోవింద జగన్నాధ పురుషోత్తమాం పాలయ

వరదానందా భద్రాద్రి వాసా శ్రీరామ రామా హరే
శ్రీమన్నారాయణ కృష్ణ గోవింద జగన్నాధ పురుషోత్తమాం పాలయ

ఏడుకొండలవాడ శ్రీ వేంకటేశుడు తిరుమలవాసా హరే
శ్రీమన్నారాయణ కృష్ణ గోవింద జగన్నాధ పురుషోత్తమాం పాలయ

Rama Chandra raghu veeraరామచంద్ర రఘువీర

రామచంద్ర రఘువీర
Audio
రామచంద్ర రఘువీర
రామచంద్ర రణధీరా
రామచంద్ర రఘునాధా
రామచంద్ర జగన్నాధా
రామ చంద్ర మమబంధో
రామచంద్ర దయాసింధో
రామచంద్ర పరంధామా
రామచంద్ర గుణధామా

దశరధనందన రామరామ్
దశముఖ మర్ధన రామరామ్
పశుపతి రంజన రామరామ్
పాప విమోచన రామరామ్.

21, జనవరి 2019, సోమవారం

Patiki harati re పతికి హారతీ రే

పతికి హారతీ రే
సురటి రాగం ,ఆదితాళం
త్యాగరాజ కృతి
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
పతికి హారతీ రే….
సీతాపతికి హారతీ రే...2….

అను పల్లవి :
అతి మృదు తర సత్య భాషణునికి..2
అఖిలాండనాధునికి సీతాపతికి హారతీ రే…..

చరణం :
బంగరు రంగు భుజంగునిపై…
చెలంగుచును మరకతాంగుడు
తెరంగున మెరయు తన అంగనతో
పలుకంగ జూచి ఉప్పొంగుచు సీతా
పతికి హారతి రే

అక్కరతో నిరు ప్రక్కల నిలిచి
తళుక్కని మెరయగ చక్కని మోమున
చుక్కలరాయని మక్కువతో సరి
ముక్కెర కదలగ గ్రక్కున సీతా
పతికి హారతీ రే

రాజ విభాకర రాజాధరామర
రాజ శుకాజ విరాజులు చూడగా
రాజమానమగు గాజులు ఘల్లన
రాజిత శ్రీత్యాగరాజనుతినికి పతికి హారతీ రే
సీతాపతికి హారతీ రే…..

8, జనవరి 2019, మంగళవారం

Mangalamani padare మంగళమని పాడరే


మంగళమని పాడరే
సురటిరాగం,  ఏకతాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
రచన,స్వర రచన :వేమూరి సరోజిని శాస్త్రీగారు
Audio
పల్లవి :
మంగళమని పాడరే….శుభ మంగళమని పాడరే….
అంగనలందరూ గోదాతల్లికి మంగళమని పాడరే…
మంగళమని పాడరే…

చరణం :
విష్ణుచిత్తుని ప్రియపుత్రి
విష్ణుమూర్తి ప్రియ సఖి
విల్లి పుత్తురున జన్మించి
విమలమతియై పరిగిన తల్లికి
…...మంగళమని పాడరే శుభమంగళమని పాడరే….

వటపత్ర సాయిని ప్రేమించి
వసుదేవసుతునే సేవించి
తననే గోపికగా  తలచి
పాడి పరవశించిన తల్లికి
….మంగళమని పాడరే శుభమంగళమని పాడరే….

లోకమున జనులను  తరియింప జేయుటకు
పవిత్రమగు తిరుప్పావై రచియించి
అజ్ఞాన తిమిరమున నిద్రించు
జగమును మేల్కొలిపిన బంగారు తల్లికి
…….….మంగళమని పాడరే….శుభ మంగళమని పాడరే….
అంగనలందరూ గోదాతల్లికి మంగళమని పాడరే…
మంగళమని పాడరే…మంగళమని పాడరే…