21, జనవరి 2019, సోమవారం

Patiki harati re పతికి హారతీ రే

పతికి హారతీ రే
సురటి రాగం ,ఆదితాళం
త్యాగరాజ కృతి
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
పతికి హారతీ రే….
సీతాపతికి హారతీ రే...2….

అను పల్లవి :
అతి మృదు తర సత్య భాషణునికి..2
అఖిలాండనాధునికి సీతాపతికి హారతీ రే…..

చరణం :
బంగరు రంగు భుజంగునిపై…
చెలంగుచును మరకతాంగుడు
తెరంగున మెరయు తన అంగనతో
పలుకంగ జూచి ఉప్పొంగుచు సీతా
పతికి హారతి రే

అక్కరతో నిరు ప్రక్కల నిలిచి
తళుక్కని మెరయగ చక్కని మోమున
చుక్కలరాయని మక్కువతో సరి
ముక్కెర కదలగ గ్రక్కున సీతా
పతికి హారతీ రే

రాజ విభాకర రాజాధరామర
రాజ శుకాజ విరాజులు చూడగా
రాజమానమగు గాజులు ఘల్లన
రాజిత శ్రీత్యాగరాజనుతినికి పతికి హారతీ రే
సీతాపతికి హారతీ రే…..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి