22, ఫిబ్రవరి 2019, శుక్రవారం

Ramabadra dara రామభద్ర రారా

రామభద్ర రారా
శంకరాభరణరాగం,అది / ఏకతాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
రామభద్ర రారా శ్రీరామచంద్రా రారా
తామరాసలోచన సీతా సమేత రారా
ముద్దు ముద్దుగారగ నవ మోహనాంగ రారా
అద్దంబు చెక్కిళ్ళవాడ నీరజాక్ష రారా
...‌‌‌..‌రామభద్ర రారా…..‌

చరణం :
చుంచు రవి రేఖతో నీ సొంపు చూపరారా
పంచదార చిలుకలతో పలుకుదువు రారా
పట్టరాని ప్రేమతో నా పట్టుకొమ్మ రారా
గట్టిగా కౌసల్య ముద్దుపట్టి వేగరారా
…..రామభద్ర రారా….

నిన్నేమనలేనురా నీలవర్ణరారా
కన్నుల పండువుగా నన్ను కన్న తండ్రి రారా
అందెల మువ్వల చేత సందడిస్తు రారా
కుందనపు బొమ్మ ఎంతో అందగాడా రారా
…...రామభద్ర రారా….

ముజ్జగములకు ఆదిమూల బ్రహ్మ రారా
గజ్జల చప్పుళ్ళు ఘల్లు ఘల్లు మనరారా
సామగాన లోల నా చక్కనయ్యరారా
రామదాసు నేలిన భద్రాద్రి వాస రారా
భద్రాద్రి వాస రారా...భద్రాద్రి వాస రారా

Rama dasaratha rama రామ దశరథరామ

రామ దశరథరామ
విశారద రాగం,ఆదితాళం
అన్నమయ్య సంకీర్తన
గానం :శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
రామ దశరథరామ ….
రామ దశరథరామ నిజ సత్య
కామ నమో నమో కాకుత్థ్స రామ
రామ….దశరథరామ….ఆ..ఆ..ఆ..ఆ...ఆ….

చరణం :
కరుణానిధి రామ కౌసల్యానందన రామ
పరమ పురుష సీతాపతి రామ...ఆ….../…….
శరధి బంధన రామ సవన రక్షక రామ
గురుతర రవివంశ కోదండరామ
రామ….దశరథరామ….ఆ..ఆ..ఆ..ఆ...ఆ….

దనుజహరణ రామ దశరథసుత రామ
వినుతామర స్తోత్ర విజయరామ..ఆ….../…..
మనుజావతార రామ మహనీయ గుణరామ
అనిలజ ప్రియరామ అయోధ్యరామ
రామ….దశరథరామ….ఆ..ఆ..ఆ..ఆ...ఆ….

సులలితయశ రామ సుగ్రీవ వరద రామ
కలుష రావణ భయంకర రామ...ఆ….../……
విలసిత రఘురామ వేదగోచర రామ
కలిత ప్రతాప శ్రీ వేంకటగిరిరామ
………..రామ దశరథరామ నిజ సత్య
కామ నమో నమో కాకుత్థ్స రామ
రామ….దశరథరామ…...రామా…...

19, ఫిబ్రవరి 2019, మంగళవారం

Veera sainika sodara వీరసైనిక సోదరా

వీరసైనిక సోదరా
కళ్యాణిరాగం
రచన : నూజెళ్ళ శ్రీనివాసుగారు
స్వర రచన,గానం : ప్రణవి మొక్కరాల

పల్లవి :
వీరసైనిక సోదరా విలువైన త్యాగము నీదిరా
తల్లి భారతి ఋణము తీర్చే తనయుడవు నీవేనురా
….వీరసైనిక సోదరా విలువైన త్యాగము నీదిరా….

చరణం:
కన్నతల్లిని ఉన్న ఊరిని అయిన వారిని విడిచిపెట్టి
మిన్నయగు మన జన్మభూమిని రక్ష చేయుగ దీక్షపట్టి
గడ్ఢకట్టే మంచులో నిప్పులను చిందు ఎడారిలో
వెన్ను చూపని తెగవుతో సరిహద్దులను కాచావురా
...వీరసైనిక సోదరా విలువైన త్యాగము నీదిరా….

మతము పేరిట మతిభ్రమించిన ఉగ్రవాదుల పీఠమణచి
ప్రగతి రథమును ప్రతిఘటించే తీవ్రవాదుల వెన్నువిరిచి
విర్రవీగు విదేశ శక్తుల కుతంత్రాలను త్రిప్పికొట్టి
విశ్రమించని పటిమతో దేశమును రక్షించావురా
…..వీరసైనిక సోదరా విలువైన త్యాగము నీదిరా…

దిక్కులన్ని పిక్కటిల్లగా జైహింద్ అని నాదమిచ్చి
కనుల నిండా నిదురనిచ్చి కలలు పండగ రక్షణిచ్చి
కణము కణము దేశసేవకు అర్పణము చేశావురా
…వీరసైనిక సోదరా విలువైన త్యాగము నీదిరా..

రాళ్ళుదువ్వే రక్కసులు నీకాలిగోరికి సాటిరారు
వెన్నుపొడిచే పిరికిపందలు నీకు ఎదురుగా నిలువలేరు
భావితరములు పాడుకొను నీ వీరచరితము ఆర్తితో
భరతమాత గళాన మణులై వెలుగు సమాన కీర్తితో

….వీరసైనిక సోదరా విలువైన త్యాగము నీదిరా
తల్లి భారతి ఋణము తీర్చే తనయుడవు నీవేనురా
వీరసైనిక సోదరా విలువైన త్యాగము నీదిరా….

16, ఫిబ్రవరి 2019, శనివారం

Uyyala balanunchedaru ఉయ్యాలా బాలునూచెదరు

ఉయ్యాలా బాలునూచెదరు
అన్నమయ్య సంకీర్తన ,లాలి పాటలు
మధ్యమావతి రాగం,ఏకతాళం
గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
ఉయ్యాలా బాలునూచెదరు కడు
నొయ్య నొయ్య నొయ్యనుచును
ఉయ్యాలా లాలి లాలి…. లాలి లాలి

చరణములు
బాల యవ్వనలు పసిడి ఉయ్యాల
బాలుని వద్ద పాడేరు
లాలి లాలి లాలి లాలెమ్మ
లాలి లాలి లాలి లాలనుచు
ఉయ్యాలా లాలి లాలి…. లాలి లాలి

తమ్మిరేకు గనుదమ్ముల నవ్వుల
పమ్ము జూపుల పాడేరు
కొమ్మలు మట్టెల గునుకుల నడపుల
ధిమ్మి ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు
ఉయ్యాలా లాలి లాలి…. లాలి లాలి

చల్లు చూపుల జవరాండ్లు రే
పల్లె బాలుని పాడేరు
బల్లిదు వేంకటపతి జేరియందెలు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లనుచు

…….ఉయ్యాలా బాలనూచెదరు కడు
నొయ్య నొయ్య నొయ్యనుచును
ఉయ్యాలా లాలి లాలి…. లాలి లాలి
…..లాలి లాలి…...


12, ఫిబ్రవరి 2019, మంగళవారం

Paahi Ramachandra's raghva పాహి రామచంద్ర రాఘవ

పాహి రామచంద్ర రాఘవ
త్యాగరాజస్వామి కృతులు
యదుకుల కాంభోజి రాగం , రూపక తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
పాహి రామచంద్ర రాఘవ హరే మాం
పాహి రామచంద్ర రాఘవ
….పాహిరామ...పాహిరామ….

చరణం :
జనక సుతా రమణ కావవే గతీ నీవు
గనుక నన్ను వేగ బ్రోవవే
…..పాహి రామ...పాహిరామ….

కష్టములను తీర్పమంటిని నీవు
నాకిష్ట దైవమనుకొంటిని
…..పాహి రామ...పాహిరామ…..

శోధనలకు నేను పాత్రమా రామ
యశో ధనులకు ఇది పాత్రమా
….పాహి రామ….పాహిరామ…..

అంబుజాక్ష వేగ చూడరా నీ కటాక్షంబు
లేని జన్మమేలరా
…….పాహి రామ….పాహి రామ…..

రాజ రాజ పూజిత ప్రభో హరే త్యాగ
రాజ రాజ రాఘవ ప్రభో

…..పాహి రామచంద్ర రాఘవ హరే మాం
పాహి రామచంద్ర రాఘవ
పాహి రామ…...4



Adimoolame ఆదిమూలమే


ఆదిమూలమే
             ఆనందభైరవి రాగం,  
తిశ్రగతి ఆదితాళం
గానం:శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
ఆదిమూలమే మాకు అంగరక్షా….2
శ్రీదేవుడే మాకు జీవరక్షా
మాకు అంగరక్షా...మాకుజీవరక్షా…,2

భుమిదేవి పతియైన పురుషోత్తముడే
మాకు భుమిపై ఏడనున్నా భుమిరక్షా…
ఆమని జలధి సాయి అయిన దేవుడే మాకు
సామీప్యమందున్న జలరక్షా….
మాకు భుమిరక్షా...మాకుజలరక్షా…
ఆదిమూలమే మాకు అంగరక్షా….

లోయుచూ అగ్నిలో యజ్ఙమూర్తి అయిన దేవుడే
ఆయములు తాకకుండా అగ్నిరక్షా…..
వాయుసుతు లేలినట్టి వనజనాభుడే మాకు
వాయువందు కందకుండా వాయురక్షా….
మాకు అగ్నిరక్షా...మాకు వాయురక్షా..
ఆదిమూలమే మాకు అంగరక్షా….

పాదమాకాశమునకు పారిజచే విష్ణువే
గాదిదియై మాకు ఆకాశరక్షా…
సాధించి వేంకటాద్రీ సర్వేశ్వరుడే మాకు
సాధరము మీరినట్టి సర్వరక్షా…ఆకాశరక్షా….మాకు సర్వరక్షా…
ఆదిమూలమే మాకు అంగరక్షా...2
మాకు అంగరక్షా….మాకు జీవరక్షా...3
మాకు సర్వరక్షా…..
...