చేసి గెలిచిరమ్మ కార్యముల్
Audio
చేసి గెలిచిరమ్మ కార్యముల్ వియ్యాలవారు చూసి చేసిరమ్మ వడ్డన...2
చేసి గెలిచిరమ్మా కార్యము చెప్పతరము గాకున్నది...2
పలువురిలో మాబావా భళి భళియని మెచ్చసాగెను
…..చేసి గెలిచరమ్మ….
అప్పడము అడిగితేను అందగత్తె పెద్ద వదిన ….2
అప్పడములు లేవనుచు కుప్పిగంతులు వేయసాగెను
...చేసి గెలిచిరమ్మ……
వడియములు అడిగితేను వన్నెలాడి….2
చిన్నవదిన వడియములు లేవనుచూ కడియములు తిప్పసాగెను
…...చేసి గెలిచిరమ్మ……
తమలపాకులడిగితేను ఠాళితోట ..2
పెద్దబావ తమలపాకులు లేవనుచు తరిమి తరిమి కొట్టసాగెను
…...చేసి గెలిచిరమ్మా…
ఇంత ఖర్చు అయినదని ఇంటిలోని పెద్దమామ..2
గుండెలను బాదుకొని మొండి గోడలు దూకసాగెను
చేసి గెలిచిరమ్మ కార్యముల్ వియ్యాలవారు చూసి చేసిరమ్మ వడ్డన
వియ్యాలవారు చూసి చేసిరమ్మ వడ్డన
వియ్యాలవారు చూసి చేసిరమ్మ వడ్డన
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి