7, మార్చి 2019, గురువారం

Neeku tagina nelata kadu నీకు తగిన నెలత కాదు

నీకు తగిన నెలత కాదు

నీకు తగిన నెలత కాదు నీరజాక్షుడా
ఎవరు కోరి తెచ్చినారో ఎరుగమైతిమి

చదువురాదు కుట్టురాదు సరసిజాక్షికి
ఈడుకూడా ఎక్కువేమో ఇంతినీకూనూ
…...నీకు తగిన….

భర్త పోషణ చేయమంటే పలుకదేమిరా
పడతి వల్ల మనుకు ఇప్పుడు పరువు హీనము…..నీకు తగిన….

గొప్పవారి బిడ్డనని గర్వమాయెరా
వేగదాని గర్వమణచి ఏలుకోవేరా
…..నీకు తగిన…..

దైవఘటన చేత నీకు తరుణి ఆయెరా
బుద్ది చెప్పి దాన్ని నీవు బుజ్జగించరా

నీకు తగిన నెలత కాదు నీరజాక్షుడా
ఎవరు కోరి తెచ్చినారో ఎరుగమైతిమి
నీకు తగిన నెలత కాదు నీరజాక్షుడా.
……


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి