1, మార్చి 2019, శుక్రవారం

Kailasagirilona కైలాసగిరిలోన

కైలాసగిరిలోన
రచన :విన్నపముల సామ్రాజ్య లక్ష్మీగారు
ఖండగతి తాళం , పరమేశ్వర ప్రియ రాగం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
కైలాసగిరిలోన ప్రమధ గణములతోను
కొలువ మరి యున్నట్టి ఈశా
కొండదిగి రావయ్య మల్లేశా
వెండి కొండదిగి రావయ్య మల్లేశా

చరణం :
నంది మద్దెల మ్రోయ భృంగి నాట్యామాడ
ముక్కోటి దేవతలు మ్రొక్కి నిలువ
గంటా నినాదాలు..శంఖారవాలు
ఢమరుక ధ్వనులతో దిశెలెల్ల నిలిచి
…..కొండదిగి రావయ్య మల్లేశా
వెండి కొండదిగి రావయ్య మల్లేశా…..

గంగాభిషేకాలు గంగాధరా నీకు
బిల్వార్చనలు సేయ నిలిచేమయా
శివకోటి నామాలు శివమెత్తి పలికేము
శివరాత్రి జాగరణ చేసేమయా
…..కొండదిగి రావయ్య మల్లేశా
వెండి కొండదిగి రావయ్య మల్లేశా…..

భవబంధములకు బంధీలమయ్యా..భవ
సాగరము దాటకున్నామయా
భవ భవా…...హర హరా….
భవ భవా,హర హరా శరణమ్ము నీయ
….కొండదిగి రావయ్య మల్లేశా
వెండి కొండదిగి రావయ్య మల్లేశా…...

.‌‌‌కైలాసగిరిలోన ప్రమధ గణములతోను
కొలువ మరి యున్నట్టి ఈశా
కొండదిగి రావయ్య మల్లేశా
వెండి దిగి రావయ్య మల్లేశా
పరమేశా జగదీశా మహేశా…...





2 కామెంట్‌లు:

  1. Do you need Finance? Are you looking for Finance? Are you looking for finance to enlarge your business? We help individuals and companies to obtain finance for business expanding and to setup a new business ranging any amount. Get finance at affordable interest rate of 3%, Do you need this finance for business and to clear your bills? Then send us an email now for more information contact us now via (financialserviceoffer876@gmail.com) whats-App +918929509036 Thank

    రిప్లయితొలగించండి
  2. మీకు ఫైనాన్స్ అవసరమా? మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? వ్యాపారం విస్తరించడానికి ఫైనాన్స్ పొందటానికి మరియు ఏదైనా మొత్తంలో కొత్త వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మేము వ్యక్తులు మరియు సంస్థలకు సహాయం చేస్తాము. 3% సరసమైన వడ్డీ రేటుతో ఫైనాన్స్ పొందండి, వ్యాపారం కోసం మరియు మీ బిల్లులను క్లియర్ చేయడానికి మీకు ఈ ఫైనాన్స్ అవసరమా? మరింత సమాచారం కోసం ఇప్పుడే మాకు ఇమెయిల్ పంపండి (financialserviceoffer876@gmail.com) whats-App +918929509036 ద్వారా మమ్మల్ని సంప్రదించండి

    రిప్లయితొలగించండి