కళ్యాణ వైభోగమే
వలజి రాగం ,ఏకతాళం
పెళ్ళి పాటలు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
కళ్యాణ వైభోగమే….
సీతాకళ్యాణ వైభోగమే …
రామాకళ్యాణ వైభోగమే
చరణం :
ఆజానుబాహుడు అసహాయశూరుడు
ఘననీలాంగుడు రాజారాముడు
జగన్మోహనాకారుడే…..
జగన్మోహనాకారుడే దశరథనందన రాముడే
పితృవాక్య పరిపాలుడే
చిరుపెదవుల చిరినగవులు విరిసిన జానకీశుడై వెలసిన రాముని కళ్యాణ
సీతాకళ్యాణ వైభోగమే….
శంఖ చక్రములు భరత శతృఘ్నులై
ఆదిశేషుడే లక్ష్మణుడై
లక్ష్మీ నారాయణులే సీతారాములై
సప్తగిరీశుడై ....భద్రగిరీశుడై…...
శ్రీలక్ష్మీ నారాయణులే సీతారాములై
పద్మావతీ రమణుడై వెలసిన
కళ్యాణ వైభోగమే
సీతాకళ్యాణ వైభోగమే
రామా కళ్యాణ సీతాకళ్యాణ
రామాకళ్యాణ వైభోగమే…...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి