5, ఏప్రిల్ 2019, శుక్రవారం

Chendataladinchare చెండాటలాడించరే

చెండాటలాడించరే
పెళ్ళి పాటలు ,పాన్పు పాట
రాగం : బహుధారి ,  ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
చెండాటలాడించరే పూల చెండాటలాడించరే
లీలా వినోదముగ చెలులందరూ గూడి
పద్మావతీ శ్రీనివాసులచే / మనజానకీ శ్రీరాములచే
…..చెండాటలాడించరే పూలచెండాటలాడించరే

అనుపల్లవి :
మల్లె మొల్లలు జాజి మరువాము దవనాము
కనకాంబరములతో ఏరి కూర్చిన పూల
….చెండాటలాడించరే పూలచెండాటలాడించరే

చరణం :
సిరిమల్లె పూదండ సిరిపైన విసరంగ
మొలకా నవ్వుల ముద్దు మోముగల మాతల్లి
అవలీలగా బట్టి విభునిపై విసరంగ
..చెండాటలాడించరే పూలచెండాటలాడించరే

కోటిపడగాలెత్తు కోనేటిరాయాడు
కొంటె తనముగా పూల చెండూను విసరంగ
అందాల మాతల్లి అలమేలుమంగ / మాలక్ష్మీదేవి
అలవోకగా పట్టి విభునిపై విసరంగ ….చెండాటలాడించరే పూలచెండాటలాడించరే.

సరస మెరిగినవాడు సప్తాగిరీశుడు / శ్రీరామచంద్రుడు
సంపెంగి పూదండ సిరిపైన విసరంగ
విభుని సరసామెరిగి అలమేలు మంగ / చిరునగవుతో సీత
సరసాముగా బట్టి విభునిపై విసరంగ

….చెండాటలాడించరే పూల చెండాటలాడించరే
లీలా వినోదముగ చెలులందరూ గూడి
పద్మావతీ శ్రీనివాసులచే…..చెండాటలాడించరే పూలచెండాటలాడించరే ….3

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి