ఏడేడు భువనాల
రాగం : మధ్యమావతి , తాళం : ఏకతాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
( లక్ష్మీదేవి పాటలు)
Audioపల్లవి :
ఏడేడు భువనాల కులుకులలరు మాసిరివే…
ఏడేడు భువనాల కులుకులలరు మాసిరివే
కలకాలము మమ్ము కరుణించరావే
మహలక్ష్మీరావే మమ్మేలుకోవే...2
చరణం :
కమల సంజాత నీవు కమలవు నీవైతేను
కమలనాభ దేవివైన అమలవు నీవు
ఆమని విమలపురము కమల నయనవు నీవు
కమలాల కొలువైన మాలక్ష్మీ నీవు
…..మహలక్ష్మీరావే మమ్మేలుకోవే…..2
సాగర సాందీపి నీవు శివానందలహరి నీవు
అంబుజమందు వెలసె సింధుజ నీవు
శశికాంతు తోడబుట్టి అవనిలోన మెట్టి నీవు
నట్టింటిలోన వెలసి నాట్యాలు చేయవమ్మ
...మహలక్ష్మీరావే మమ్మేలుకోవే .....2
శృంగార రూపిణివి సౌందర్యలహరి నీవు
సిరిరాజ వాహినివి మదనుని జనని
మమ్మేల మహి వెలసిన శ్రీమహాలక్ష్మీ నీవు
మమ్మాదరించవే మాలక్ష్మీ నీవే
మహలక్ష్మీరావే మమ్మేలుకోవే….2
మమ్మేలుకోవే..మమ్మేలుకోవే...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి