లక్ష్యా లక్ష్య స్వరూపిణి
రాగం : రీతిగౌళ , తాళం : మిశ్రగతి
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు.
Audio
లక్ష్యా లక్ష్య స్వరూపిణి అంబా లక్ష్మీదేవి
లలితాదేవి అక్షయ వరమీయవే
…...లక్ష్యా లక్ష్య స్వరూపిణి….
మహాగౌరి స్వరూప బ్రహ్మాండనాయకి
మాతృ స్వరూపిణి మము బ్రోవరాదటే
…….లక్ష్యా లక్ష్య స్వరూపిణి….
పార్వతి పావని జనని పాపవిమోచని
పాలించవేలనే భక్త శరణ్యవే
…...లక్ష్యా లక్ష్య స్వరూపిణి…...
కైవల్యదాయిని నీవే నా కన్నతల్లివి
కటాక్షముంచవే కాపాడవే అంబా
….లక్ష్యా లక్ష్య స్వరూపిణి అంబా లక్ష్మీదేవి లలితాదేవి
అక్షయ వరమీయవే….3
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి