19, అక్టోబర్ 2019, శనివారం

Aadidevudasita kantudu ఆదిదేవుడశిత కంఠుడన్ని చోట్ల

ఆదిదేవుడశిత కంఠుడన్ని చోట్ల
ఏకతాళం,
రచన : సామవేద షణ్ముక శర్మగారి 
శివపదం లోనిది
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరి గారు
సంగీతం : వినుకొండ మురళీమోహన్
(శివుని పాటలు)
Audio
పల్లవి :
ఆదిదేవుడశిత కంఠుడన్ని చోట్ల రక్ష
శంభుడు మాపాలి స్వామి సర్వకాల రక్ష

చరణం :
భూమి రథము నెక్కు వేల్పు భూమిపైన రక్ష
జడల గంగ దాల్చు భవుడు జలములోన రక్ష
అగ్నినేత్రధారి హరుడు అగ్నిలోన రక్ష...
ఆయువిచ్చు అఖిలవర్తి వాయువులో రక్ష
…….ఆదిదేవుడశిత కంఠుడన్ని చోట్ల రక్ష
శంభుడు మాపాలి స్వామి సర్వకాల రక్ష….

ఆకాశ కేశ పాశధారి ఆకశాన రక్ష
దిగంబరుడు అష్టమూర్తి దిక్కులలో రక్ష
దివ్య ధవళ దేహధారి దేహానికి రక్ష...
షణ్ముఖ సన్నుతుడు శివుడు సమకూర్చిన రక్ష
….ఆదిదేవుడశిత కంఠుడన్ని చోట్ల రక్ష
శంభుడు మాపాలి స్వామి సర్వకాల రక్ష….3

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి